Amit Shah: సంయమనం పాటించండి
ABN , First Publish Date - 2022-12-15T11:44:32+05:30 IST
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం గురించి సుప్రీంకోర్టు సూచన మేరకు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలతో చర్చలు
బెంగళూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం గురించి సుప్రీంకోర్టు సూచన మేరకు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సూచించారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పాల్గొన్నారు. సరిహద్దు అంశంపై రాజకీయాలు చేయరాదని షా సూచించారు. రెండు రాష్ట్రాల నుంచి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పరిశీలిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.