ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తున్న ఉక్రెయిన్ ప్రజలు

ABN , First Publish Date - 2022-02-24T20:31:53+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరవాసులు యుద్ధ భయంతో ప్రాణాలు అరచేత

ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తున్న ఉక్రెయిన్ ప్రజలు

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరవాసులు యుద్ధ భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తున్నారు. దేశంలో సురక్షితంగా ఉండే పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సాధారణ ప్రజలతో నిండిన కార్లు, తదితర వాహనాలతో కీవ్ నగరంలోని రోడ్లన్నీ క్రిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. 


వీరంతా ఆహారం, తాగునీటి కోసం అనేక అవస్థలు అనుభవిస్తున్నారు. చిన్న పిల్లలుగలవారు మరిన్ని కష్టాలకు గురవుతున్నారు. పాలు సహా అత్యవసర పదార్థాలు అందుబాటులో లేవు. 


Read more