అంబానీ అదానీలను నిందించడం తగదు: హార్ధిక్ పటేల్

ABN , First Publish Date - 2022-05-19T23:35:00+05:30 IST

గాంధీనగర్: వ్యాపారవేత్తలైన అంబానీ, అదానీలను మాటికీ నిందించడం తగదని గుజరాత్ యువనేత హార్ధిక్ పటేల్ అన్నారు. ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందినవారని ఆయన

అంబానీ అదానీలను నిందించడం తగదు: హార్ధిక్ పటేల్

గాంధీనగర్: వ్యాపారవేత్తలైన అంబానీ, అదానీలను మాటికీ నిందించడం తగదని గుజరాత్ యువనేత హార్ధిక్ పటేల్ అన్నారు. ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందినవారని ఆయన మీదున్న కోపాన్ని అంబానీ, అదానీలపై చూపడం తగదని హార్ధిక్ సూచించారు. వ్యాపారవేత్తలు కష్టపడి ఎదుగుతారని, ఉత్తినే వారిని విమర్శించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తరచుగా అదానీ, అంబానీలను విమర్శిస్తున్న నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తన మూడేళ్ల రాజకీయ జీవితం వృధా అయిపోయిందని హార్ధిక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఏ పనీ అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. Updated Date - 2022-05-19T23:35:00+05:30 IST