Gujarat ఎన్నికల్లో ఎంఐఎం పోటీ...అసదుద్దీన్ ఒవైసీ వెల్లడి

ABN , First Publish Date - 2022-05-30T17:44:33+05:30 IST

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమైంది...

Gujarat ఎన్నికల్లో ఎంఐఎం పోటీ...అసదుద్దీన్ ఒవైసీ వెల్లడి

పోర్‌బందర్‌(గుజరాత్):త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమైంది.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం పోర్‌బందర్‌ చేరుకున్నారు.గుజరాత్ ఎన్నికల కోసం మజ్లిస్ పార్టీని సమాయత్తం చేసేందుకు కచ్‌లో సమావేశం, ర్యాలీలో ఒవైసీ పాల్గొననున్నారు. గుజరాత్ రాష్ట్రంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధించామని ఒవైసీ అన్నారు.మహారాష్ట్రలోని భివాండీలో ఎంపీ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు.


Updated Date - 2022-05-30T17:44:33+05:30 IST