Delhi Safdarjung Hospital: నిన్న ఎయిమ్స్...నేడు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై సైబర్ అటాక్

ABN , First Publish Date - 2022-12-04T15:37:04+05:30 IST

దేశరాజధానిలో ప్రధాన వైద్య సంస్థలు సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐదు సర్వర్లపై హ్యాకింగ్ దాడి జరిగి..

Delhi Safdarjung Hospital: నిన్న ఎయిమ్స్...నేడు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై సైబర్ అటాక్

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రధాన వైద్య సంస్థలు సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS-Delhi)లోని ఐదు సర్వర్లపై హ్యాకింగ్ దాడి జరిగి ఇంకా పరిస్థితి చక్కబడక ముందే ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital) హ్యాకర్ల బారిన పడిన విషయం వెలుగుచూసింది. అయితే, ఈ సైబర్ దాడిలో ఎయిమ్స్‌కు జరిగిన నష్ట తీవ్రత కంటే సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి జరిగిన తీవ్రత తక్కువేనని చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మాన్యువల్ తరహాలో గరిష్ట సేవలు అందిస్తుండటంతో డాటా లీక్ తక్కువేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

తీవ్రత హెచ్చు మోతాదులో లేదు...

కాగా, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై జరిగిన సైబర్ దాడి మరీ అంత తీవ్రం కాదని, ఆసుపత్రి సర్వర్‌లోని కొన్ని సెక్షన్లపై సైబర్ దాడి ప్రభావం ఉందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బి.ఎల్.షేర్వాల్ తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి సర్వర్‌పై హ్యాకర్లు దాడి చేశారని, ఒకరోజు సర్వర్ డౌన్ అయిందని ఆయన చెప్పారు. సమస్యను వెంటనే ఆసుపత్రి టీమ్‌తో కలిసి ఎన్ఐసీ టీమ్ సరిచేసిందని, ప్రస్తుతం ఆసుపత్రి సేవలు సజావుగా జరుగుతున్నాయని, డాటా సురక్షితంగానే ఉందని తెలిపారు.

Updated Date - 2022-12-04T15:39:59+05:30 IST