విజయోత్సాహంతో గుజరాత్ రోడ్‌షోలో మోదీ
ABN , First Publish Date - 2022-03-11T21:04:07+05:30 IST
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ..

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. పుష్పాలంకృతమైన ఓపెన్ కార్లో మోదీ ప్రజలకు విక్టరీ సంకేతం చూపిస్తూ ముందుకు సాగారు. విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం 'కమలం' వరకూ సుమారు 10 కిలోమీటర్లు రోడ్‌షో తీశారు. మోదీకి అభినందనలు తెలిపేందుకు ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరామ్', 'భారత్ మాతా కీ జై' నినాదాలు హోరెత్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సైతం మోదీతో పాటు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.