అఫ్తాబ్‌కు రేపు నార్కో పరీక్ష
ABN , First Publish Date - 2022-11-30T02:44:35+05:30 IST
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ, నవంబరు 29: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అఫ్తాబ్‌ను డిసెంబరు 1, 5 తేదీల్లో రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎ్‌సఎల్)కు తీసుకెళ్లనున్నారు. ఇదే ఎఫ్‌ఎ్‌సఎల్‌లో సోమవారం అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించి తిరిగి జైలుకు తీసుకెళుతుండగా అతను ఉన్న వ్యాన్‌పై దుండగులు తల్వార్లతో దాడి చేశారు. దీంతో ఎఫ్‌ఎ్‌సఎల్ దగ్గర పారామిలిటరీ దళాలతో భద్రతను భారీగా పెంచారు. ఆఫ్తాబ్‌కు మంగళవారం మరో విడత పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.