నటి దీపిక పదుకొణెకు తీవ్ర అస్వస్థత?

ABN , First Publish Date - 2022-09-28T07:24:17+05:30 IST

ప్రముఖ హిందీ నటి దీపిక పదుకొణె సోమవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పలు హిందీ సినిమా వెబ్‌సైట్‌లు మంగళవారం వెల్లడించాయి.

నటి దీపిక పదుకొణెకు తీవ్ర అస్వస్థత?

ముంబై, సెప్టెంబరు 27: ప్రముఖ హిందీ నటి దీపిక పదుకొణె సోమవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పలు హిందీ సినిమా వెబ్‌సైట్‌లు మంగళవారం వెల్లడించాయి. ఆమె సన్నిహితులు వెంటనే బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతం దీపిక తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. కొన్ని నెలల క్రితం తెలుగు సినిమా ప్రాజెక్టు-కె చిత్రీకరణ సమయంలోనూ ఆమె అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Read more