మనువరాలిపై లైంగిక వేధింపులు.. చివరికి తాత ఎలా చనిపోయాడంటే..

ABN , First Publish Date - 2022-05-28T02:12:08+05:30 IST

మాజీ మంత్రిగా నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతున్న ఓ ప్రబుద్ధుడు తన మనువరాలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మనువరాలిపై లైంగిక వేధింపులు.. చివరికి తాత ఎలా చనిపోయాడంటే..

హల్ద్వాని, ఉత్తరఖండ్ : మాజీ మంత్రిగా నలుగురిలో గౌరవమర్యాదలు పొందుతున్న ఓ ప్రబుద్ధుడు సొంత మనువరాలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వావివరసలు మరచి కన్నకొడుకు కూతురిపైనే కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. చివరికి తానంతట తానే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోయాడు. ఉత్తరఖండ్‌లోని హల్ద్వానిలో వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


ఉత్తరఖండ్‌కు చెందిన మాజీ సహాయమంత్రి, ప్రస్తుతం ఓ యూనియన్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్న రాజేంద్ర బహుగుణ తన సొంత మనువరాలినే లైంగికంగా వేధించాడు. 59 ఏళ్ల వయసులో ఈ నీచపు పనికి పాల్పడిన అతడిపై కోడలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటివలే పోలీసులు పోస్కో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద అతడిపై  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో బుధవారం ఓ వాటర్ ట్యాంక్ ఎక్కిన బహుగుణ తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఉత్తరఖండ్‌లోని హల్ద్వానిలోని భగత్ సింగ్ కాలనీలో ఈ ఘటన జరిగిందని నైనిటాల్ సీనియర్ ఎస్పీ పంకజ్ భట్ వెల్లడించారు. కాగా తండ్రి ఆత్మహత్య విషయంలో కొడుకు సంయమనం పాటించాడు. భార్యపై ఎలాంటి కేసు పెట్టలేదు. తన భార్యే ఆత్మహత్యకు పురిగొల్పినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు. కాగా 2004-05 సమయంలో సీఎంగా ఎన్‌డీ తివారీ ఉన్నప్పుడు బహుగుణ సహాయమంత్రిగా పనిచేశాడు.

Updated Date - 2022-05-28T02:12:08+05:30 IST