బీజేపీ దృష్టిలో మహిళలంటే వస్తువులు

ABN , First Publish Date - 2022-09-28T07:21:29+05:30 IST

ఉత్తరాఖండ్‌లో రిసార్ట్‌ రిసెప్షనిస్ట్‌ అంకితా భండారీ హత్యోదంతం...

బీజేపీ దృష్టిలో మహిళలంటే వస్తువులు

ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్‌ అంకిత హత్యపై రాహుల్‌ ఆవేదన

మలప్పురం, సెప్టెంబరు 27: ఉత్తరాఖండ్‌లో రిసార్ట్‌ రిసెప్షనిస్ట్‌ అంకితా భండారీ హత్యోదంతం...  మహిళలను వస్తువులుగా చూసే బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సల ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కేరళలో భారత్‌ జోడో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్‌... వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అనుసరిస్తుండగా మంగళవారం మలప్పురం జిల్లాలోకి ప్రవేశించారు. ఓ పాఠశాల వద్ద పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగిస్తూ అంకిత హత్యోదంతాన్ని ప్రస్తావించారు. అంకిత మృతికి సంతాపంగా మౌనం పాటించాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు.

Read more