aviation strike: 500 విమాన సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-07-18T18:24:56+05:30 IST

ఇటలీ దేశంలో నాలుగు గంటల విమానయాన సమ్మె కారణంగా 500 విమాన సర్వీసులు రద్దు చేశారు....

aviation strike: 500 విమాన సర్వీసుల రద్దు

రోమ్(ఇటలీ): ఇటలీ(Italy) దేశంలో నాలుగు గంటల విమానయాన సమ్మె కారణంగా(aviation strike) 500 విమాన సర్వీసులు రద్దు చేశారు.తమకు జీతాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ విమానాశ్రయ ఉద్యోగులు నాలుగు గంటల విమానయాన సమ్మెకు దిగడంతో ఇటలీ దేశంలో 500 విమాన సర్వీసులను( flights) రద్దు చేశారు.తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నాలుగు గంటలపాటు వాకౌట్ చేశారు. ర్యాన్‌ఎయిర్, ఈజీజెట్, వోలోటియా ఎయిర్‌లైన్స్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారని ఇటాలియన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.దీంతో 500 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు యూనియన్ అధికారి ఫాబ్రిజియో కుస్సిటో తెలిపారు. 


ఎయిర్‌లైన్ కార్మికులు మెరుగైన వేతనంతో పాటు మెరుగైన పని పరిస్థితులను కోరుతున్నారు.ఉద్యోగుల సమ్మె కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ల వాకౌట్ నాలుగు గంటల పాటు కొనసాగింది. ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లోని విమానాశ్రయాలతో పోలిస్తే ఇటలీ విమానాశ్రయాల్లో ఈ వేసవిలో తీవ్ర గందరగోళం నెలకొంది.


Updated Date - 2022-07-18T18:24:56+05:30 IST