పార్లమెంట్‌ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా అభిషేక్‌

ABN , First Publish Date - 2022-10-08T09:53:01+05:30 IST

వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని కాంగ్రెస్‌ నామినేట్‌ చేసింది.

పార్లమెంట్‌ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా అభిషేక్‌

న్యూఢిల్లీ, అక్టోబరు  7: వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని కాంగ్రెస్‌ నామినేట్‌ చేసింది.  లోక్‌సభ, రాజ్యసభకు చెందిన పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఇటీవల పునరువ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా హోం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘాల అధ్యక్ష పదవుల నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, శశి థరూర్‌లను తొలగించి వారి స్థానంలో బ్రిజ్‌లాల్‌, ప్రతా్‌పరావు జాదవ్‌లను కేంద్రం నియమించింది. కాగా కాంగ్రె్‌సకు కేటాయించిన ఎరువులు, రసాయనాల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎవరిని నామినేట్‌ చేయలేదు.

Read more