దమ్ముంటే నాపై పోటీ చేయండి: పంజాబ్ సీఎంకు భగవంత్ మాన్ సవాల్
ABN , First Publish Date - 2022-01-22T21:35:11+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ సవాలు

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ సవాలు విసిరారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ధురీ స్థానం నుంచి తనపై పోటీ చేసి గెలవాలని చాలెంజ్ విసిరారు. తాను చామ్‌కౌర్ సాహిబ్ (చన్నీ నియోజకవర్గం) నుంచి పోటీ చేయలేనని, అది రిజర్వుడు స్థానమని పేర్కొన్నారు. అయితే, ఆయన (చన్నీ) మాత్రం ధురీ స్థానం నుంచి పోటీ చేస్తే తాను ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.
సంగ్రూర్ జిల్లాలో ఉన్న ఇదే స్థానం నుంచి భగవంత్ మాన్ ఎంపీగా ఉన్నారు. ప్రజల నుంచి 93 శాతం మద్దతు లభించడంతో ఈ నెల 18న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి దల్వీర్ సింగ్ ఖంగురా ఎమ్మెల్యేగా ఉన్నారు.