Punjab నుంచి రాజ్యసభకు ఆప్ అభ్యర్థులు వీరే...
ABN , First Publish Date - 2022-03-21T18:03:08+05:30 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పాఠక్‌లను రాజ్యసభకు నామినేట్...

హర్భజన్‌సింగ్, రాఘవ్చద్దా, డాక్టర్ సందీప్‌ల ఖరారు
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పాఠక్‌లను రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించింది.అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హర్భజన్ సింగ్‌ను యూత్ ఐకాన్ గా దేశంలో బాగా తెలిసిన పేరు. రాజ్యసభ స్థానానికి ఆయన మంచి అభ్యర్థి అని ఆప్ పార్టీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు చాలా సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం ఉంది.పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైనప్పటి నుంచి రాఘవ్ చద్దా తన సత్తాను నిరూపించుకున్నారు.
అతను పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా పనిచేశారు. పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.చద్దా ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ రాజ్యసభకు ఆయనను పంపించాలని ఆప్ నాయకత్వం భావిస్తోంది. ఆప్ ఢిల్లీ నుండి పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌కు ఒక సీటు ఇచ్చింది. పంజాబ్‌లోని ఏడు రాజ్యసభ స్థానాల్లో ఐదింటికి మార్చి 31న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘంఇటీవల ప్రకటించింది.