కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

ABN , First Publish Date - 2022-10-01T08:15:21+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో తాజాగా కాబూల్‌లోని ఓ విద్యా కేం ద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది.

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

విద్యా కేంద్రంపై ముష్కరుల పంజా

పరీక్షకు సన్నద్ధమవుతుండగా పేలుడు

19 మంది విద్యార్థులు మృతి

27 మందికి పైగా గాయాలు.. 


కాబూల్‌, సెప్టెంబరు 30: అఫ్ఘానిస్థాన్‌లో తాజాగా కాబూల్‌లోని ఓ విద్యా కేం ద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం ఉదయం దశ్తి బార్చి సమీపంలోని విద్యా కేంద్రంలో మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం మేరకు 19 మంది విద్యార్థులు మరణించారని, 27 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తోంది. అఫ్ఘాన్‌లో మైనారిటీలైన షియా వర్గానికి చెందిన హజారా తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో 300 మందికిపైగా విద్యార్థులు వర్సిటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కాజ్‌ ఉన్నత విద్యా కేంద్రానికి వచ్చారు. విద్యార్థులంతా నమూనా పరీక్షకు సిద్ధమవుతున్నారు. 7.30 గంటల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి షఫీ అక్బరీ(19) తెలిపాడు. తన చుట్టూ మృతదేహాలతో పాటు తీవ్ర గాయాలై పడిపోయిన వారు కనిపించారని చెప్పాడు. ఈ దాడిలో 19 మంది మరణించారని.. 27 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

Read more