మెక్సికోలో కాల్పుల బీభత్సం

ABN , First Publish Date - 2022-10-07T09:07:20+05:30 IST

మెక్సికోలో గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రెండు ఘటనల్లో 21 మంది ప్రాణాలు తీశారు.

మెక్సికోలో కాల్పుల బీభత్సం

చట్టసభ సభ్యురాలు, మేయర్‌ సహా 21 మంది హతం 

మెక్సికో, అక్టోబరు 6 : మెక్సికోలో గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రెండు ఘటనల్లో 21 మంది ప్రాణాలు తీశారు. మృతుల్లో ఒక చట్టసభ సభ్యురాలు, ఓ మేయర్‌ కూడా ఉన్నారు. మెక్సికోలో మాదక ద్రవ్యాల ముఠాలకు కేంద్రమైన శాన్‌ మిగేల్‌ టోటోలాపన్‌ పట్టణంలో స్థానిక మేయర్‌ అధ్యక్షతన ఓ సమావేశం జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్‌, అతని తండ్రి (మాజీ మేయర్‌) సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే టకీలారోస్‌ ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిందని అనుమానిస్తున్నారు. ఇక, మోరెలోస్‌ రాష్ట్రం, క్యుర్నవాకాలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. చట్టసభ సభ్యురాలు గాబ్రియెలా మరీన్‌ను తుపాకీతో కాల్చి చంపారు. 

Read more