స్కూల్ బస్సులో కొండచిలువ!
ABN , First Publish Date - 2022-10-17T08:56:57+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో స్కూల్ బస్సులో పెద్ద కొండచిలువను కనుగొన్నారు.
సెలవు కావడంతో తప్పిన ప్రమాదం
రాయ్‌బరేలి, అక్టోబరు 16: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో స్కూల్ బస్సులో పెద్ద కొండచిలువను కనుగొన్నారు. బస్సు సీటు కింద నక్కిన కొండచిలువను సిబ్బంది గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సిబ్బంది వచ్చి కొండచిలువను సురక్షితంగా పట్టుకుని తమ వెంట తీసుకువెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.