Dwaram Mangathayar : పఖ్యాత వయోలిన్ విద్వాంసురాలు ద్వారం మంగతాయారు కన్నుమూత
ABN , First Publish Date - 2022-12-15T03:01:31+05:30 IST
ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసురాలు ద్వారం మంగతాయారు(92) కన్నుమూశారు. వయోభారానికి తోడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం చెన్నైలో తుదిశ్వాస
చెన్నై, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసురాలు ద్వారం మంగతాయారు(92) కన్నుమూశారు. వయోభారానికి తోడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రపంచ ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు దివంగత ద్వారం వెంకటస్వామి నాయుడి పెద్దకుమార్తె అయిన మంగతాయారు పదేళ్ల ప్రాయం నుం చే వయోలిన్ సాధన చేసేవారు. అనంతర కాలంలో దేశ, విదేశాల్లో కచేరీలు ఇచ్చి రికార్డు సృష్టించారు. టీఆర్ మహాలింగం, ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి మహామహులతో కలసి కచేరీలు ఇచ్చారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో వేలాది మంది విద్యార్థులకు సంగీతం నేర్పించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ అవార్డు, రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు, ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ అవార్డు తదితరాలను అందుకున్నారు. కళకే తన జీవితాన్ని అర్పించిన మంగతాయారు అవివాహితగానే ఉండిపోయారు. ఆమె భౌతికకాయానికి గురువారం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి.