ముంబైలో 700 కిలోల మెఫెడ్రోన్‌ డ్రగ్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-05T12:02:58+05:30 IST

ముంబై పోలీసులు 700 కిలోలకుపైగా మెఫెడ్రోన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముంబైలో 700 కిలోల మెఫెడ్రోన్‌ డ్రగ్‌ స్వాధీనం

దీని విలువ రూ.1,400 కోట్లు.. ఐదుగురి అరెస్ట్‌  

ముంబై, ఆగస్టు 4: ముంబై పోలీసులు 700 కిలోలకుపైగా మెఫెడ్రోన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,400 కోట్లు ఉంటుందని అధికారులు గురువారం తెలిపారు. గత ఏడాది కాలంలో మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో నిషేధిత డ్రగ్‌ను స్వాధీనం చేసుకోలేదన్నారు. పాల్ఘర్‌ జిల్లాలోని నలసోపరా (పశ్చిమ)లో ఉన్న డ్రగ్‌ తయారీ యూనిట్‌పై ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్‌ సెల్‌ (ఏఎన్‌సీ) బృందం దాడులు జరిపి నిషేధిత డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2022-08-05T12:02:58+05:30 IST