రాయ్‌పూర్‌కు 40మంది ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2022-08-31T08:37:12+05:30 IST

ఝార్ఖండ్‌లోని అధికార యూపీఏ కూటమికి చెందిన సుమారు 40 మంది ప్రజాప్రతినిధులను ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఖరీదైన రిస్టార్టుకు అధికార

రాయ్‌పూర్‌కు 40మంది ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు!

తరలించిన అధికార కూటమి


రాయ్‌పూర్‌, ఆగస్టు 30: ఝార్ఖండ్‌లోని అధికార యూపీఏ కూటమికి చెందిన సుమారు 40 మంది ప్రజాప్రతినిధులను ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఖరీదైన రిస్టార్టుకు అధికార పక్షం మంగళవారం తరలించింది. రాంచీ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరిన ఒక ప్రత్యేక విమానం, కాంగ్రెస్‌ పాలిత ఛత్తీ్‌సగఢ్‌లోని వివేకానంద ఎయిర్‌పోర్టులో మంగళవారం సాయంత్రం ల్యాండ్‌ అయింది. ఆ వెంటనే మూడు ప్రత్యేక బస్సుల్లో నవరాయ్‌పూర్‌లోని మేఫెయిర్‌ లేక్‌ రిసార్టుకు ఎమ్మెల్యేలను తరలించారు. రిసార్టులోకి మీడియా వ్యక్తులకు సైతం ప్రవేశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. గడచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను రాయ్‌పూర్‌కు తరలించడం ఇది మూడోసారి కావ డం గమనార్హం. ఝార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లుండగా, అధికార యూపీఏ కూటమికి 49మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుందని ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌ ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను రాయ్‌పూర్‌కు తరలించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  

Read more