రూ.274 కోట్లకు మద్యం విక్రయం

ABN , First Publish Date - 2022-08-17T16:52:32+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం దుకాణాలకు సెలవు ప్రకటించడంతో, ఆదివారం ఒకేరోజు రూ.274 కోట్ల మద్యం

రూ.274 కోట్లకు మద్యం విక్రయం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 16:  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం దుకాణాలకు సెలవు ప్రకటించడంతో, ఆదివారం ఒకేరోజు రూ.274 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రతిరోజు(every day) రూ.100 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతుండగా, వారంతపు సెలవు, పండుగ రోజుల్లో  పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో, గత ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రూ.274 కోట్ల మద్యం విక్రయం కాగా, చెన్నై మండలంలో రూ.56 కోట్ల వ్యాపారం జరిగింది. 


Read more