23న Madhurai నుంచి కాశీకి ‘ఊలా రైల్‌’

ABN , First Publish Date - 2022-07-05T15:05:50+05:30 IST

భారత రైల్వే మదురై నుంచి దివ్య కాశీకి ‘ఊలా పర్యాటక రైల్‌’ నడపనుంది. ‘ఆడి అమావాస్య యాత్ర’ పేరుతో నడవనున్న ఈ రైలు వివరాలను భారత టూరిజం

23న Madhurai నుంచి కాశీకి ‘ఊలా రైల్‌’

చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): భారత రైల్వే మదురై నుంచి దివ్య కాశీకి ‘ఊలా పర్యాటక రైల్‌’ నడపనుంది. ‘ఆడి అమావాస్య యాత్ర’ పేరుతో నడవనున్న ఈ రైలు వివరాలను భారత టూరిజం శాఖ రీజనరల్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ ఫరూఖ్‌, దక్షిణరైల్వే సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వి.జయంతి, తమిళనాడు ట్రావెల్‌ మార్ట్‌ అధ్యక్షుడు డి.కరుణానిధి తదితరులు సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ రైలు తొలిసారిగా ఈ నెల 23వ తేదీ మదురై నుంచి బయలేరనుంది. 12 రోజుల యాత్ర కోసం బయలుదేరే ఈ రైలు పీతాంపుర, పూరి, కోణార్క్‌, జైపూర్‌, కోల్‌కతా, కాశి, గయ, ప్రయాగ్‌రాజ్‌, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఆగనుంది. ఇందులో ప్రయాణించాలనుకునే ఔత్సాహికులు మదురై, దిండుగల్‌, విల్లుపురం, ఎగ్మూర్‌, నెల్లూరు, విజయవాడ లో కూడా ఎక్కవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. టిక్కెట్లు బుక్‌ చేసుకోదలచిన వారు www. ularail.com. వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. ఇందులో 3ఏసీ కోచ్‌లు-4, స్లీపర్‌ కోచ్‌లు -6, ప్యాంట్రీకార్‌-2 కోచ్‌లు వుంటాయని అధికారులు తెలిపారు. 

Read more