భారత్‌లో 200 కోట్ల టీకాలు పూర్తి

ABN , First Publish Date - 2022-07-18T07:45:00+05:30 IST

కొవిడ్‌-19కు టీకాలు ప్రారంభించిన 18నెలల్లోనే భారత్‌ 200 కోట్ల టీకాల మార్కును దాటి చరిత్ర సృష్టించింది.

భారత్‌లో 200 కోట్ల టీకాలు పూర్తి

18 నెలల్లోనే చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్న ఇండియా

న్యూఢిల్లీ, జూలై 17: కొవిడ్‌-19కు టీకాలు ప్రారంభించిన 18నెలల్లోనే భారత్‌ 200 కోట్ల టీకాల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. 2021, జనవరి 16న భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు శనివారం రాత్రి వరకూ దేశవ్యాప్తంగా 199.97 టీకాలను అందించారు. వీటిలో 5.48 కోట్ల బూస్టర్‌ డోసులు కూడా ఉన్నాయి. 100 కోట్ల డోసులను చేరుకునేందుకు భారత్‌కు 277 రోజులు పట్టింది. కేవలం 79 రోజుల్లోనే 150 కోట్లను చేరుకోగా.. 200 కోట్ల టీకాలు పూర్తయ్యేందుకు 191రోజుల సమయం పట్టింది.  కాగా.. టీకాలు 200 కోట్ల మార్కును దాటడం పట్ల ప్రధాని మోదీ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారత్‌ మరోమారు చరిత్ర సృష్టించింది. టీకాలు 200 కోట్ల మార్కు దాటిన సందర్భంగా భారతీయులందరికీ అభినందనలు. ఈ కార్యక్రమానికి పాటుపడిన వారందరి పట్ల గర్వంగా ఉంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-07-18T07:45:00+05:30 IST