11 జిల్లాలకు వర్షసూచన
ABN , First Publish Date - 2022-07-03T14:28:21+05:30 IST
రాష్ట్రంలో 11 జిల్లాలలతో పాటు పుదుచ్చేరిలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం

పెరంబూర్(చెన్నై), జూలై 2: రాష్ట్రంలో 11 జిల్లాలలతో పాటు పుదుచ్చేరిలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, తేని, దిండుగల్, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూర్, తిరువణ్ణామలై, రాణిపేట సహా 11 జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో 3 నుంచి 6వ తేదీ వరకు భారీవర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటూ, సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతవరణ కేంద్రం తెలిపింది.