మహిళల పెళ్లి వయసు పురుషులు నిర్ణయించారు: ప్రియాంక

ABN , First Publish Date - 2022-01-04T00:59:03+05:30 IST

మహిళల పెళ్లి వయసును పురుష ఎంపీలంతా కలిసి నిర్ణయించారని రాజ్యసభ సభ్యురాలు, శివసేన పార్టీ నేత

మహిళల పెళ్లి వయసు పురుషులు నిర్ణయించారు: ప్రియాంక

న్యూఢిల్లీ: మహిళల పెళ్లి వయసును పురుష ఎంపీలంతా కలిసి నిర్ణయించారని రాజ్యసభ సభ్యురాలు, శివసేన పార్టీ నేత ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. దీనికి సంబంధించి నియమించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీల్లో 30 మంది ఎంపీలు పురుషులేనని, మహిళ ఒక్కరంటే ఒక్కరే ఉన్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ మహిళల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ కమిటీలో మహిళా ఎంపీలను పెంచాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.


‘‘మహిళల పెళ్లి వయసును 18 నుంచి 21కి పెంచిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఉన్న 31 మంది సభ్యుల్లో 30 మంది పురుష ఎంపీలే ఉన్నారు. మహిళల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పార్లమెంటరీ కమిటీ మరింత ఉన్నతంగా ఉండాలంటే ఆ కమిటీలో మహిళలు ఎక్కువగా ఉండాలి. ఇందుకు మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.

Read more