పాక్ డ్రోన్‌ను కూల్చేస్తే లక్ష.. బీఎస్‌ఎఫ్ ఆఫర్
ABN , First Publish Date - 2022-12-31T04:52:49+05:30 IST
సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల సాయంతో భారత్‌లోకి డ్రగ్స్, ఆయుధాలు చేరవేస్తోంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 30: సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల సాయంతో భారత్‌లోకి డ్రగ్స్, ఆయుధాలు చేరవేస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎ్‌సఎఫ్) తన బృందాలకు బంపరాఫర్ ప్రకటించింది. దేశంలోకి చొరబడే పాక్ డ్రోన్లను కూల్చేసిన టీమ్‌కు రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించింది. కాగా, పాక్ నుంచి డ్రగ్స్, ఆయుధాలు పొందడానికి డ్రోన్లు ఉపయోగించే వారి గురించి బీఎ్‌సఎ్‌ఫకు సమాచారం ఇచ్చిన సాధారణ ప్రజలకు కూడా పంజాబ్ సరిహద్దు దళం గతంలో ఇలాగే రూ.1లక్ష నగదు బహమతి అందజేసింది. ఈ ఏడాది (డిసెంబరు 25 వరకు) ఇప్పటివరకు బీఎ్‌సఎఫ్ బలగాలు 22 డ్రోన్లు కూల్చివేశాయని, దీనిలో భాగస్వామ్యమైన 12 టీమ్‌లకు రివార్డులు కూడా అందజేశామని బీఎ్‌సఎఫ్ అధికారి తెలిపారు. ఈ ఏడాది కూల్చివేసిన 22 డ్రోన్లన్నీ పంజాబ్ సరిహద్దలోనే కావడం విశేషం.