America పాఠశాల ముందు కాల్పులు...ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-03-08T13:27:51+05:30 IST

అమెరికా దేశంలోని ఓ పాఠశాల ముందు జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

America పాఠశాల ముందు కాల్పులు...ఒకరి మృతి

 మరో ఇద్దరు యువకులకు గాయాలు

వాషింగ్టన్ : అమెరికా దేశంలోని ఓ పాఠశాల ముందు జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్స్ డౌన్‌టౌన్ సమీపంలోని ఈస్ట్ హై స్కూల్ మైదానంలో కారులో వచ్చిన వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని డెస్ మోయిన్స్ పోలీసులు చెప్పారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే పాఠశాలలో విద్యార్థులను లోపల లాక్‌డౌన్‌లో ఉంచారు. కాల్పుల ఘటన పీడకల అని ప్రిన్సిపాల్ జిల్ వెర్ స్టీగ్ చెప్పారు.కాల్పుల ఘటన దృష్ట్యా మంగళవారం జరగాల్సిన పేరెంట్-టీచర్స్ సదస్సును వాయిదా వేశారు.


Updated Date - 2022-03-08T13:27:51+05:30 IST