Row in karnatka: క్లాసు రూములకు కాషాయం పెయింటింగ్‌ నిర్ణయం ఎవరిదంటే..?

ABN , First Publish Date - 2022-11-14T20:00:11+05:30 IST

కర్ణాటకలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. స్వామి వివేకానంద పేరుతో ''ప్రాజెక్ట్ వివేకా'' కింద కాషాయం రంగు పెయింటింగ్‌‌తో రాష్ట్రంలో 8,000 పాఠశాలలను..

Row in karnatka: క్లాసు రూములకు కాషాయం పెయింటింగ్‌ నిర్ణయం ఎవరిదంటే..?

బెంగళూరు: కర్ణాటకలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. స్వామి వివేకానంద పేరుతో ''ప్రాజెక్ట్ వివేకా'' (Project Viveka) కింద కాషాయం రంగు పెయింటింగ్‌‌తో రాష్ట్రంలో 8,000 పాఠశాలలను నిర్మించనున్నట్టు కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ (BC Nagesh) ప్రకటించారు. దీంతో విద్యారంగంలో కాషాయీకరణ ప్రయత్నం జరుగుతోందంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కలబురగి జిల్లాలో మంత్రి ఆదివారంనాడు ఈ ప్రకటన చేశారు. వివేకానంద శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ''విద్యా దాన సమితి ఎడ్యుకేషన్ సొసైటీ'' ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వివేకా కొత్త క్లాస్‌రూమ్‌లు కాషాయం రంగులో ఉండబోతున్నాయని చెప్పారు.

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరిచారు. సెక్యులర్ ఇన్‌స్టిట్యూషన్లను మతపరంగా తీసుకోవడం ఎందుకుని డవలప్‌మెంట్ ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ నిరంజనారాధ్య వీకే ప్రశ్నించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు వీలుగా చైల్డ్ ఫ్రండ్లీ క్లాస్‌ రూమ్‌లు అవసరం ఉందని, మంత్రి ఇష్టాఇష్టాలకో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ ఐడియాలజీకి అనుగుణంగానో నిర్ణయాలు ఉండరాదని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ, మతపరమైన ఉద్దేశాలతో, విద్యారంగాన్ని కాషాయీకరణం చేసే వ్యవహారంగానే చూడాల్సి ఉంటుందన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక విలువలకు వ్యతిరేకమని చెప్పారు.

మంత్రి వివరణ...

కాగా, వివేకా పాఠశాలలకు కాషాయం రంగు పెయింటింగ్ నిర్ణయాన్ని మంత్రి బీసీ నగేష్ సమర్ధించుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, ఈ ప్రాజెక్టుతో ప్రమేయమున్న ఆర్కిటెక్క్ నిర్ణయమేనని వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిన దానిని బట్టే తాము ముందుకు వెళ్తాల్సి ఉంటుందని అన్నారు. కొందరు వ్యక్తులు ప్రతి విషయాన్ని రాజకీయ అవకాశవాద కోణంలో చూస్తుంటారని, వారికి కాషాయం కలర్ ఎలర్జీ ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు.

జాతీయజెండాలో లేదా?: సీఎం

క్లాస్‌రూమ్‌లకు కాషాయం రంగు పెయింటింగ్‌పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, జాతీయ జెండాలో కాషాయం రంగు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ''స్వామి వివేకానంద పేరుతో వీటిని నిర్మిస్తున్నాం. ఆయన ఒక సాధువు. కాషాయం మాత్రమే ధరించేవారు. వివేకం అంటే జ్ఞానం అని అర్థం. వారికి (కాంగ్రెస్) అలాంటి జ్ఞానం కలుగుతుందని ఆశిద్దాం'' అని సీఎం వ్యాఖ్యానించారు.

వివేకా క్లాస్ రూమ్ పథకం..

వివేకా క్లాస్ రూమ్ పథకం కింద పాత, వినియోగంలో లేని పాఠశాలల స్థానంలో కొత్త పాఠశాలు వివేకా క్లాస్‌రామ్స్‌ పేరుతో నిర్మిస్తారు. ఈ వెల్ఫేర్ స్కీమ్‌ కింద రూ.992 కోట్లను కేటాయిస్తారు. రాష్ట్ర నిధులతో ప్రభుత్వం 7,000 పాఠశాలలు నిర్మిస్తుంది. తక్కిన 1000 క్లాస్‌రూమ్‌లు కల్యాణ కర్ణాటక రీజినల్ డవలప్‌మెట్ బోర్డ్ (కేకేఆర్‌డీడీ) ఫండ్‌తో నిర్మిస్తారు.

Updated Date - 2022-11-14T20:06:24+05:30 IST