Viral video: ఆపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేలా రాకెట్లు పేల్చిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-10-26T16:18:11+05:30 IST

దీపావళి పర్వదినం సందర్భంగా మహరాష్ట్ర రాజధాని థానే జిల్లాలో ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అపార్ట్‌మెంట్ వాసులను భయపెట్టేందుకు ఆ యువకుడు చేసిన పని స్థానికంగా కలకలం సృష్టించింది.

Viral video: ఆపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేలా రాకెట్లు పేల్చిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

దీపావళి పర్వదినం సందర్భంగా మహరాష్ట్ర రాజధాని థానే జిల్లాలో ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అపార్ట్‌మెంట్ వాసులను భయపెట్టేందుకు ఆ యువకుడు చేసిన పని స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ యువకుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీపావళి సందర్భంగా అందరూ క్రాకర్స్ కాల్చుతుంటే.. ఓ యువకుడు మాత్రం థానేలోని ఓ అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రాకెట్‌లను వదిలాడు. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లేలా ఓ పథకం ప్రకారం పేల్చాడు. దీంతో ఆ ఆపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆ యువకుడి చేష్టలను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఆ వ్యక్తిపై థానే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతణ్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.

Updated Date - 2022-10-26T16:19:58+05:30 IST