China: చైనాలో రికార్డు స్థాయిలో కరోనా...రోజుకు 30వేల కేసులు

ABN , First Publish Date - 2022-11-24T08:29:14+05:30 IST

చైనా దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి మొదలైంది. గురువారం నాడు చైనా దేశంలో రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అవడం సంచలనం...

China: చైనాలో రికార్డు స్థాయిలో కరోనా...రోజుకు 30వేల కేసులు
China Covid Cases

బీజింగ్ (చైనా): చైనా దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి మొదలైంది. గురువారం నాడు చైనా దేశంలో రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అవడం సంచలనం రేపింది.(Hits Record High) చైనాలో(China) గురువారం 31,454 కరోనా కేసులు(Covid) నమోదయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో(National Health Bureau) అధికారిక డేటా వెల్లడించింది. సామూహిక కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు.మళ్లీ ప్రబలుతున్న కరోనా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.షాంఘై(Shanghai) నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 29,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-11-24T08:29:15+05:30 IST