Madame Tussauds : కింగ్ చార్లెస్ మైనపు బొమ్మపై నిరసనకారుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-24T17:07:24+05:30 IST

బ్రిటన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds)లో ఉన్న కింగ్ చార్లెస్ (King Charles) మైనపు విగ్రహంపై జస్ట్ స్టాప్ ఆయిల్

Madame Tussauds : కింగ్ చార్లెస్ మైనపు బొమ్మపై నిరసనకారుల ఆగ్రహం
king charless wax statue

లండన్ : బ్రిటన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds)లో ఉన్న కింగ్ చార్లెస్ (King Charles) మైనపు విగ్రహంపై జస్ట్ స్టాప్ ఆయిల్ (Just Stop Oil) నిరసనకారులు ఆగ్రహం ప్రదర్శించారు. ఈ విగ్రహంపై ఇద్దరు నిరసనకారులు కస్టర్డ్ పై పూశారు. వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కస్టర్డ్ పై (Custard pie) అంటే ఉడికించని ఆహార పదార్థం. పాలు, గుడ్లు, పంచదార, ఉప్పు, వనిలా వంటివాటిని కలిపి దీనిని తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీటన్నిటినీ కలిపి పాక్షికంగా ఉడికిస్తారు.

జస్ట్ స్టాప్ ఆయిల్ అనేది ఓ ఉద్యమం. బ్రిటన్‌లో చమురు అన్వేషణ, చమురు శుద్ధి కేంద్రాల అభివృద్ధి, ఖనిజ ఇంధనాల ఉత్పత్తి కోసం కొత్తగా అనుమతులు ఇవ్వరాదని ఈ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అనేక సంస్థలు, సంఘాలు కలిసి ఓ కూటమిగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. వీటికి కొత్తగా అనుమతులు ఇవ్వకపోవడం మానవ మనుగడ కోసం వేసే తొలి అడుగు అని వీరు చెప్తున్నారు. మనకు అవసరమైనదాని కన్నా ఎక్కువ చమురు, సహజ వాయువు ఇప్పటికే మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఖనిజ ఇంధనాలపై ఆధారపడటాన్ని మానుకోవాలని చెప్తున్నారు.

లండన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు వ్యక్తులు సోమవారం లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని కింగ్ చార్లెస్ మైనపు విగ్రహానికి కస్టర్డ్ పై పూశారు. ఆ విగ్రహానికి నష్టం కలిగించినందుకు ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరూ ఆ విగ్రహానికి నేరపూరితంగా నష్టం కలిగించారు.

Updated Date - 2022-10-24T17:12:15+05:30 IST