Rishi Sunak Sacred Thread: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేతికున్న కంకణంపై అందరి దృష్టి

ABN , First Publish Date - 2022-10-25T20:32:43+05:30 IST

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి(UK prime minister)గా బాధ్యతలు స్వీకరించాక రిషి సునాక్ (Rishi Sunak) చేసిన తొలి ప్రసంగ సమయంలో ఆయన చేతికున్న కంకణం (Sacred Thread) అందరి దృష్టినీ ఆకర్షించింది.

Rishi Sunak Sacred Thread: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేతికున్న కంకణంపై అందరి దృష్టి
Rishi Sunak Sacred Thread

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి(UK prime minister)గా బాధ్యతలు స్వీకరించాక రిషి సునాక్ (Rishi Sunak) చేసిన తొలి ప్రసంగ సమయంలో ఆయన చేతికున్న కంకణం (Sacred Thread) అందరి దృష్టినీ ఆకర్షించింది. హిందూ (Hindu) సంప్రదాయాలను పాటించే రిషి సునాక్ చేతికున్న పవిత్ర దారంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి దీపావళి పండుగ సందర్భంగా ఆయన తన భార్య అక్షతా మూర్తితో కలిసి సౌతాంఫ్టన్‌లోని ఇస్కాన్ మందిరాన్ని సందర్శించారు. స్వాముల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. ఆ సమయంలోనూ ఆయన చేతికి పవిత్రదారం ఉంది. రిషి సునాక్ తాత రామ్‌దాస్ సునాక్ సౌతాంఫ్టన్‌లోని వేదిక్ సొసైటీ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని రిషి సునాక్ వీలైనప్పుడల్లా సందర్శిస్తుంటారు. ఏటా అన్నదానాలు కూడా చేస్తుంటారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటన్‌‌కు ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్ రికార్డు సృష్టించారు. అంతేకాదు భారత్‌ను రెండొందల ఏళ్లకు పైగా ఏలిన బ్రిటన్‌‌కు ఒక హిందూ ప్రధాని కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఆసక్తికర పరిణామంపై అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక రిషి సునాక్ చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. బ్రిటన్‌ను ఆర్ధిక కష్టాల నుంచి బయటపడేస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాను కోవిడ్ సమయంలో ఎంత చురుగ్గా వ్యవహరించానో రిషి సునాక్ గుర్తు చేశారు. గత ప్రధాని లిజ్ ట్రస్ (Liz Truss) చేసిన తప్పిదాలను సరిచేసేందుకే తనకు ప్రధాని బాధ్యతలు అప్పగించారని రిషి సునాక్ చెప్పారు.

ఇంగ్లాండ్ సౌతాంఫ్టన్‌లో జన్మించిన సునాక్‌ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్ డాక్టర్. తల్లి ఉషా సునాక్ ఫార్మసిస్ట్. రిషి తండ్రి కెన్యాలో పుట్టి పెరిగారు. తల్లి టాంజానియాలో పుట్టి పెరిగారు. వీరి పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారు. కెన్యా రిషి సునాక్ వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు. ఆక్స్‌ఫర్డ్, లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమిక్స్ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ చేశారు. విద్యార్ధిగా ఉన్న సమయంలో సౌతాంఫ్టన్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో రిషి సునాక్ వెయిటర్‌గా పనిచేశారు. 2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్.

Updated Date - 2022-10-25T22:49:52+05:30 IST