Japanese Billionaire: స్పేస్‌ఎక్స్ రాకెట్‌ యాత్రపై జపాన్ బిలియనీర్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-12-09T08:03:51+05:30 IST

స్పేస్‌ఎక్స్ రాకెట్‌ యాత్రపై జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా సంచలన ప్రకటన చేశారు....

Japanese Billionaire: స్పేస్‌ఎక్స్ రాకెట్‌ యాత్రపై జపాన్ బిలియనీర్ సంచలన ప్రకటన
Japanese Billionaire Maezawa

వాషింగ్టన్ : స్పేస్‌ఎక్స్ రాకెట్‌ యాత్రపై జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా సంచలన ప్రకటన చేశారు.(Japanese Billionaire Maezawa)స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో 2023వ సంవత్సరంలో చంద్రుని చుట్టూ ప్రయాణించడానికిMoon Voyage) తనతో 8 మంది ప్రముఖులు చేరనున్నట్లు మేజావా ప్రకటించారు.(Announces)

డియర్‌మూన్‌గా పిలిచే ఈ మిషన్‌ను మొదట 2018వ సంవత్సరంలో జపాన్ మిలియనీర్ ప్రకటించారు.(Crew Members)యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన స్టీవ్ అయోకి నిర్మాత డీజే, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, చెక్ కళాకారుడు యెమి ఏడీ, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియాన్నోన్ ఆడమ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీమ్ ఇలియా, అమెరికన్ ఫిల్మ్ మేకర్ బ్రెండన్ హాల్, భారతీయ నటుడు దేవ్ జోషి,దక్షిణ కొరియా సంగీతకారుడు కే-పాప్ లను స్పేస్ యాత్రకు తీసుకువెళ్లనున్నట్లు మేజావా ప్రకటించారు.

వీరితోపాటు బ్యాకప్ సిబ్బందిగా అమెరికా దేశానికి చెందిన స్నోబోర్డర్ కైట్లిన్ ఫారింగ్టన్, జపాన్‌కు చెందిన నర్తకి మియులు ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు.డియర్‌మూన్ వెబ్‌సైట్‌లోని మిషన్ ప్రొఫైల్ గ్రాఫిక్ ప్రకారం రౌండ్ ట్రిప్ దాదాపు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ మాల్ వ్యవస్థాపకుడైన మెజావా గత సంవత్సరం రష్యన్ సోయుజ్ రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 10 బిలియన్ యెన్‌లు చెల్లించారు.

Updated Date - 2022-12-09T08:03:52+05:30 IST