Air Suvidha: విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-11-22T06:26:46+05:30 IST

విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే విమాన ప్రయాణికులకు తాజాగా భారత్ సర్కార్ శుభవార్త వెల్లడించింది...

Air Suvidha: విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు శుభవార్త
International Passengers

ఎయిర్ సువిధ ఫారమ్ రద్దు...నేటి అర్దరాత్రి నుంచి అమలు

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే విమాన ప్రయాణికులకు తాజాగా భారత్ సర్కార్ శుభవార్త వెల్లడించింది.ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఇన్‌కమింగ్ అంతర్జాతీయ ప్రయాణికులు(International Passengers) పూరించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్(Air Suvidha Forms) ఇప్పుడు నిలిపివేశామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ( Ministry of Civil Aviation) ప్రకటించింది.(India Cancels)కరోనావైరస్( కేసులు తగ్గుముఖం పట్టడం,ప్రపంచవ్యాప్తంగా,భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీలో గణనీయమైన పురోగతిని సాధించిన దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నవంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి(మంగళవారం అర్దరాత్రి) అమల్లోకి రానుంది.

Updated Date - 2022-11-22T08:08:17+05:30 IST