మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ మృతి

ABN , First Publish Date - 2022-12-01T02:13:46+05:30 IST

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌(96) బుధవారం కన్నుమూశారు. ఈమేరకు దేశ అధికారిక వార్తాసంస్థలు తెలిపాయి.

మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ మృతి

బీజింగ్‌, నవంబరు 30: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌(96) బుధవారం కన్నుమూశారు. ఈమేరకు దేశ అధికారిక వార్తాసంస్థలు తెలిపాయి. దేశం అతలాకుతలంగా ఉన్న సమయంలో పగ్గాలు చేపట్టి, వ్యవస్థను గాడిలో పెట్టి, దేశాభివృద్ధికి బాటలు వేసిన నాయకుడిగా చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ఆయన్ను పరిగణిస్తుంటుంది. 1926, ఆగస్టు 17న యాంగ్‌షౌ నగరంలో జియాంగ్‌ జన్మించారు. 1983లో తొలిసారిగా ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమల మంత్రిగా రాజకీయాల్లో ప్రధాన పదవిని పొందారు. అనంతరం 1985-89 మధ్యకాలంలో షాంఘై మేయర్‌గా వ్యవహరించారు. 1989లో సీసీపీ కేంద్ర సైనిక కమిషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1993లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో చైనా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జియాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2022-12-01T02:13:47+05:30 IST