President Obiang: నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగానే.. ప్రపంచ రికార్డ్!

ABN , First Publish Date - 2022-11-27T16:46:16+05:30 IST

ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్‌గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) తాజాగా జరిగిన రీ ఎలక్షన్‌లో

President Obiang: నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగానే.. ప్రపంచ రికార్డ్!
Teodoro Obiang Nguema Mbasogo

మలాబో: ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్‌గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) తాజాగా జరిగిన రీ ఎలక్షన్‌లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. ఫలితంగా నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ప్రధానిగా ఒబియంగ్ రికార్డులకెక్కారు. రీ ఎలక్షన్‌లో ఆయన విజయం సాధించిన విషయాన్ని ఒబియంగ్ కుమారుడు, ఉపాధ్యక్షుడు అయిన టియోడోరో ఎన్‌గ్వెమా ఒబియంగ్ మాంగ్వె తెలిపారు.

ఇటీల జరిగిన రీ ఎలకషన్‌లో 80 ఏళ్ల ఒబియంగ్‌ 95 శాతం ఓట్లు అంటే దాదాపు 4,05,910 ఓట్లతో విజయం సాధించారు. ఒబియంగ్ మరో ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారని ఎలక్టోరల కమిషన్ హెడ్ ఫాస్టినో ఎన్‌డోంగ్ ఎసోనో ఐయాంగ్ తెలిపారు. ఈ ఎన్నికలో 98 శాతం ఓట్లు పోలైనట్టు చెప్పారు. 1.5 మిలియన్ల జనాభా కలిగిన ఈ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీలో చమురు పుష్కలంగా లభిస్తుంది. ఇప్పటికై బలమైన పాలకుడిగా పేరు సంపాదించుకున్న ఒబియంగ్ మరోమారు విజయం సాధించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలిస్తున్న అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.

అధికార డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా (PDGE), సంకీర్ణ కూటమి కలిసి సెనేట్‌లో 55 స్థానాలు, దిగువ సభ అయిన చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 100 స్థానాలు గెలుచుకున్నట్టు ఉపాధ్యక్షుడు తెలపారు. తమది గొప్ప రాజకీయ పార్టీ అని ఈ ఎన్నికతో మరోమారు రుజువైందన్నారు. ఒబియంగ్ 1979లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పలు మిలటరీ తిరుగుబాట్ల నుంచి ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు. ఈక్వటోరియల్ గినియాలో మీడియాను ప్రభుత్వం నియంత్రిస్తుందన్న ఆరోపణలున్నాయి. అలాగే, నిరసనలను అణచివేస్తుందని, రాజకీయ ప్రత్యర్థులను తరచూ అరెస్ట్ హింసించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం మరణశిక్షను రద్దు చేసి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది.

Updated Date - 2022-11-27T16:46:17+05:30 IST