Qatar Airways: దోహా-జకార్తా విమానంలో సాంకేతిక లోపం...ముంబయిలో అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2022-12-29T08:32:38+05:30 IST

ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన దోహా-జకార్తా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది...

Qatar Airways: దోహా-జకార్తా విమానంలో సాంకేతిక లోపం...ముంబయిలో అత్యవసర ల్యాండింగ్
Qatar Airways flight

ముంబయి : ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన దోహా-జకార్తా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.(Doha-Jakarta flight) సాంకేతిక లోపం(technical snag) కారణంగా విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.సాంకేతిక లోపం కారణంగానే ఖతార్ ఎయిర్‌వేస్ విమానాన్ని(Qatar Airways flight) ముంబయికు(Mumbai) మళ్లించామని(flight diverted) ఖతార్ ఎయిర్ వేస్ అధికారులు చెప్పారు. ప్రయాణికులను తరలించేందుకు విమానాన్ని పంపించనున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది.విమాన ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి ఖతార్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది.

ప్రయాణికులను వీలైనంత త్వరగా ఇండోనేషియాకు తరలిస్తామని ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది. డిసెంబర్ నెల ప్రారంభంలోను ఖతార్‌లోని దోహాకు వెళుతున్న ఇండిగో విమానం 3 హైడ్రాలిక్ సిస్టమ్‌లలో ఒకదాంట్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ముంబయిలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగుతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

Updated Date - 2022-12-29T11:10:09+05:30 IST