Italy Landslide: ఇటాలియన్ హాలిడే ఐలండ్‌లో ఘోరం... ఎనిమిది మంది మృతి...

ABN , First Publish Date - 2022-11-26T17:55:36+05:30 IST

ఇటాలియన్ హాలిడే ఐలండ్ ఇషియాలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. కొండచరియలు

Italy Landslide: ఇటాలియన్ హాలిడే ఐలండ్‌లో ఘోరం... ఎనిమిది మంది మృతి...
Italy Holiday Island

న్యూఢిల్లీ : ఇటాలియన్ హాలిడే ఐలండ్ ఇషియాలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. కొండచరియలు విరిగి పడటంతో భవనాలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందాలు అతి కష్టం మీద ఇక్కడికి చేరుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇటలీ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మట్టెయో సల్విని ఈ వివరాలను వెల్లడించారు. అంతకుముందు వెలువడిన వార్తల ప్రకారం, కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 13 మంది ఆచూకీ తెలియడం లేదు.

ఇటలీ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దీవికి ఉత్తర దిశలో ఉన్న కసమిక్సియోలా టెర్మెలో ఓ ఇంటి చుట్టూ కొండచరియ శిథిలాలు పడ్డాయి. ఈ ఇంట్లో నివసిస్తున్నవారి పరిస్థితిని తెలుసుకునేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. కొండచరియ విరిగిపడటంతో రోడ్డుపై బురదలో కార్లు కొండ దిగువకు జారిపోయాయి. ఓ వాహనం సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ వాహనంలోని ఇద్దరిని కాపాడగలిగారు.

Updated Date - 2022-11-26T17:55:41+05:30 IST