Canada: తుపాకీతో రెచ్చిపోయిన వృద్ధుడు.. ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-12-20T23:12:22+05:30 IST

కెనడాలో ఓ వృద్ధుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా ఐదుగురు మరణించారు.

Canada: తుపాకీతో రెచ్చిపోయిన వృద్ధుడు.. ఐదుగురి మృతి

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో(Canada) ఓ వృద్ధుడు(73) విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా ఐదుగురు మరణించారు. టొరొంటో(Toronto) నగర శివారులోని తన అపార్ట్‌మెంట్‌లో ఆదివారం నిందితుడు ఈ మారణహోమానికి(Shooting) పాల్పడ్డాడు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని కాల్చి చంపారు. అతడు సెమీ ఆటోమేటిక్ గన్‌తో కాల్పులకు తెగ బడ్డట్టు పోలీసుల తెలిపారు. పలు అంతస్తుల్లో ఉన్న వారిని అతడు పొట్టనపెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. వృద్దుడి దాడికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. నిందితుడు కావాలనే ఆ ఐదుగురిని లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా..ఈ ఘటన చాలా దారుణమైనదని నగర మేయర్ స్టీవెన్ డెల్ డూకా వ్యాఖ్యానించారు. ఇలా ఘటన ఈ నగరంలో అదీ.. క్రిస్మస్‌కు కొద్ది రోజులు ముందు జరుగుతుందని తాను ఏనాడూ ఊహించలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్టు ఫెడరల్ పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో మెండీసినో పేర్కొన్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే కెనడాలో ఇటీవల తుపాకీ సంస్కృతి జూలు విదిలుస్తోంది. దీంతో.. తుపాకీ విక్రయాలపై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2022-12-20T23:49:19+05:30 IST