చేతి వేళ్లు తిమ్మిర్లు వస్తున్నాయి. తగ్గడానికి ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-02-09T17:59:09+05:30 IST

చేతి వేళ్లలోని నరాలకు ఏదైనా సమస్య రావడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తాయి. ఏదైనా బలమైన దెబ్బ తగలడం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి

చేతి వేళ్లు తిమ్మిర్లు వస్తున్నాయి. తగ్గడానికి ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(09-02-2022)

ప్రశ్న: మా బామ్మగారి వయసు డెబ్భై ఏళ్లు. చేతి వేళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయి. తగ్గడానికి ఏమి చేయాలి?


- సాహితి, హైదరాబాద్


డాక్టర్ సమాధానం: చేతి వేళ్లలోని నరాలకు ఏదైనా సమస్య రావడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తాయి. ఏదైనా బలమైన దెబ్బ తగలడం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోవడం, కిడ్నీ సమస్యలు, డి, బి-12 విటమిన్ లోపాలు మొదలైన కారణాల వల్ల నరాల పని తీరు దెబ్బ తినే అవకాశం ఉంది. రక్తపోటును నియంత్రించేందుకు ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించేందుకు పీచుపదార్థం అధికంగా ఉండే ముడిధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మొదలైనవి తినాలి. తెల్లబియ్యం, మైదా, చక్కెర వంటివి మానేయాలి. ప్రతి పూటా ఆహారం తీసుకునే ముందు కనీసం ఒక పది నిమిషాలు నడవడం కూడా మంచిదే. బి-12 విటమిన్ కోసం పాలు, గుడ్లు, మాంసం లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ -డి కోసం రోజూ కనీసం అరగంటైనా ఎండలో గడపాలి. ఒకవేళ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యుల సలహాతో తగిన సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-09T17:59:09+05:30 IST