తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే..

ABN , First Publish Date - 2022-10-17T16:49:32+05:30 IST

తలనొప్పికి ఒత్తిడి కారణమైతే దాన్ని తొలగించుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు, ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే మెలకువలను అలవరుచుకోవాలి.

తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే..

తలనొప్పికి ఒత్తిడి కారణమైతే దాన్ని తొలగించుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు, ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే మెలకువలను అలవరుచుకోవాలి. 


  • రోజుకు మూడు సార్లు నియమిత వేళల్లో భోజనం తినాలి.
  • తాజాగా వండిన, వేడిగా ఉన్న, వేడి వేడి సూప్‌లు తాగాలి. చల్లగా, పొడిగా, పెళుసుగా ఉండే పదార్థాలు తినకూడదు. తీపి, ఉప్పు, కారం తగ్గించాలి.
  • కాఫీ, టీలు మానేసి, వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.
  • గోరువెచ్చని నూనెతో శరీర మర్దన ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు ఈ అభ్యంగన ఆచరించాలి. ఇలాంటి స్నానంతో రక్తప్రసరణ మెరుగై, నాడీ వ్యవస్థ నెమ్మదించి పెరిగిన తల భారం తగ్గుతుంది. గంధం పొడి, రోజా పువ్వుల నుంచి తీసిన నూనెలను కలిపి, కణతల దగ్గర మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది. 
  • యోగాభ్యాసంతో శరీర కణజాలానికి పోషణ అంది, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, లింఫ్‌ వ్యవస్థలు చైతన్యమవుతాయి. కండర కణజాలం స్వాంతన పొంది, నొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ముందుకు వంగే వీలున్న ఆసనాలు వేయాలి. 
  • పిప్పర్‌మింట్‌, లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనెలు కూడా ఉపయోగపడతాయి.

Updated Date - 2022-10-17T16:49:32+05:30 IST