నల్లటి మచ్చలు పోవాలంటే.. బ్యూటీ క్రీమ్స్‌కు బదులు ఇంట్లోనే ఇవి ట్రై చేయండి!
ABN , First Publish Date - 2022-02-09T17:07:32+05:30 IST
ముఖంమీద నల్లటి మచ్చలు చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. వీటిని తొలగించడానికి రసాయనాలతో కూడిన బ్యూటీ క్రీమ్స్ వాడుతుంటారు.

ఆంధ్రజ్యోతి(09-02-2022)
ముఖంమీద నల్లటి మచ్చలు చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. వీటిని తొలగించడానికి రసాయనాలతో కూడిన బ్యూటీ క్రీమ్స్ వాడుతుంటారు. ఇలా చేసినపుడు డార్క్ స్పాట్స్ పోవడం పక్కన పెడితే సున్మితమైన చర్మం దెబ్బతింటుంది. అందుకే సహజమైన కొన్ని పదార్థాలతో నల్లటి మచ్చలను ఇలా తగ్గించుకోవచ్చు.
బొప్పాయిలో ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం మీద ఉండే మృతకణాలను తొలగిస్తాయి. డల్‌గా ఉండే కణాలను తొలగిస్తాయి. అందుకే బొప్పాయి చూర్ణాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ బొప్పాయి ఫేస్ మాస్క్ తరచుగా వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
ముత్యమంత పసుపు పట్టించుకునే ముఖానికి వెలుగు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, టీస్పూన్ తేనె కలిపి చూర్ణంగా చేయాలి. ఆ చూర్ణాన్ని ముఖానికి పట్టిస్తే మెరుగైన చర్మం తయారవుతుంది.
బంగాళదుంపలో సి-విటమిన్, పొటాషియం ఉంటాయి. బంగాళదుంప చూర్ణానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట పాటు ఆరనీయాలి. గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మం మీద ఉండే నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
ఉల్లిపాయ తొక్కను నల్లటి మచ్చలున్న చోట రుద్దినా చక్కటి ఫలితం ఉంటుంది.