రక్తపోటును పెంచే చక్కెర
ABN , First Publish Date - 2022-07-26T19:45:47+05:30 IST
అధిక రక్తపోటు అని తెలిసినప్పుడు ఉప్పును దూరం పెడతాం. ఆహారంలో ఉప్పును తగ్గిస్తాం. కానీ ఉప్పు

అధిక రక్తపోటు అని తెలిసినప్పుడు ఉప్పును దూరం పెడతాం. ఆహారంలో ఉప్పును తగ్గిస్తాం. కానీ ఉప్పు కంటే చక్కెర ఎక్కువగా అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. ఇందుకు చక్కెర తయారీలో ఉపయోగించే పదార్థాలు ఓ కారణం. అలాగే అధికంగా చక్కెర తినడం మూలంగా రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరిగిపోయి, సింపథెటిక్ నాడీ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఫలతంగా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. ఉప్పు మన శరీర జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అతి అంతటా చేటు అన్న విధంగా ఉప్పు విషయంలో సైతం అతికి పోకుండా పరిమితంగా తీసుకోగలిగితే, అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎటువంటి హానీ లేకుండా జీవించవచ్చు.