వ్యాధులకు దూరంగా... ఆరోగ్యంగా...

ABN , First Publish Date - 2022-09-03T19:53:37+05:30 IST

వానాకాలం(rainy season)లో సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయి(Seasonal diseases). ముఖ్యంగా పిల్లల విషయంలో ఆహారం, పరిశుభ్రతకు

వ్యాధులకు దూరంగా... ఆరోగ్యంగా...

వానాకాలం(rainy season)లో సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయి(Seasonal diseases). ముఖ్యంగా పిల్లల విషయంలో ఆహారం, పరిశుభ్రతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఈ వర్షాల్లో మీ చిన్నారుల(Childrens) ఆరోగ్య రక్షణకు వారు ఇస్తున్న సూచనలివి... 


  • చల్లని వాతావరణం వల్ల పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగరు. దీనివల్ల డీహైడ్రేషన్‌ అయ్యే ప్రమాదం ఉంది. కనుక దాహం లేకపోయినా నీళ్లు బాగా తాగేలా చూడాలి. 
  • పిల్లలను వర్షంలో ఆడుకోనివ్వకపోవడమే ఉత్తమం. ఎందుకంటే పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీళ్లు కూడా వీధుల్లో పారుతుంటాయి. వాటిల్లో ఉండే కంటికి కనిపించని బ్యాక్టీరియాలు, వైర్‌సలు అనారోగ్యానికి కారణమవుతాయి. 
  • ఎంత అడిగినా పిజ్జాలు, బర్గర్లు, కట్‌ చేసిన పండ్లు, ఛాట్‌, పానీపూరీ, జ్యూస్‌ల వంటి స్ర్టీట్‌, జంక్‌ఫుడ్‌కు పిల్లలకు దూరంగా పెట్టాలి. వీటిల్లో వాన నీరు కలిసే అవకాశం ఉంది. పరిశుభ్రత పాటించకపోతే ఎన్నో రకాల క్రిములు పుట్టుకొస్తాయి. 
  • వర్షాకాలం ఆయిల్‌, స్పైసీ ఫుడ్స్‌ తినకపోవడమే మంచిది. ఫ్రిజ్‌లో పెట్టిన నిన్న మొన్నటి ఆహారం అస్సలు ముట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి, ఏరోజుకారోజు ఇంట్లోనే వండుకొని తినడం శ్రేయస్కరం. 
  • అరటి, పైనాపిల్‌, ఆపిల్‌, పీచ్‌, ప్లమ్‌, చెర్రీ, ఆప్రికట్‌ వంటి పండ్లు తినిపించడంవల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిల్లోని విటమిన్‌ సి, యాంటిఆక్సిడెంట్స్‌ మెరుగైన ఆరోగ్యానికి దోహదపడతాయి. పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే సి-విటమిన్‌ పుష్కలంగా ఉన్న పండ్లు క్రమం తప్పకుండా తినిపించాలి.

Read more