బ్యూటీపార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేస్తే..!
ABN , First Publish Date - 2022-02-17T18:12:45+05:30 IST
ముఖానికి ఫేసియల్ లాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటూ ఉంటాం. మరి పాదాల సంగతేంటి? అంటే వాటికీ సౌందర్యచికిత్స అవసరమే ఉంటుంది. అయితే బ్యూటీపార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అదెలాగంటే....

ఆంధ్రజ్యోతి(17-02-2022)
ముఖానికి ఫేసియల్ లాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటూ ఉంటాం. మరి పాదాల సంగతేంటి? అంటే వాటికీ సౌందర్యచికిత్స అవసరమే ఉంటుంది. అయితే బ్యూటీపార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అదెలాగంటే....
నీళ్లు - అర బకెట్, గ్లిజరిన్ - రెండు చెంచాలు, నిమ్మకాయలు - రెండు, షాంపూ ప్యాకెట్ - 1, రాతి ఉప్పు - రెండు చెంచాలు
పెడిక్యూర్ ఇలా: ఒక బకెట్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. అందులో గ్లిజరిన్, నిమ్మరసం కలపాలి. ఉప్పు, షాంపూ వేసి కరిగేవరకూ నీళ్లను కలియబెట్టాలి. ఈ నీళ్లలో కాళ్లను పది నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత పాదాలకు సబ్బు రుద్ది పనికిరాని టూత్‌బ్ర్‌షతో పాదాలు, మడమలు, వేళ్లు, గోళ్లు రుద్దుకోవాలి. తర్వాత ప్యుమిస్ స్టోన్‌తో రుద్ది మృతచర్మాన్ని వదిలించాలి. తర్వాత ఎక్కువ నీళ్లతో కాళ్లు రుద్ది కడిగేసుకోవాలి. చివరగా పాదాలు తడి లేకుండా తుడిచి కొబ్బరినూనె లేదా వెన్న పూసుకోవాలి.