చక్కెర కంటే బెల్లమే మేలు.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-22T18:37:59+05:30 IST

అల్లం పరోటాలు, బెల్లం రొట్టెలు, బెల్లంతో చేసిన బొబ్బట్లు, బెల్లంతో చేసిన టీ, కాఫీలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. చక్కెర కంటే బెల్లమే మేలని ఆహారనిపుణులు చెబుతారు. బెల్లం వల్ల జీర్ణాశయంలోని ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో మినరల్స్‌తో

చక్కెర కంటే బెల్లమే మేలు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రజ్యోతి(22-01-2022)

అల్లం పరోటాలు, బెల్లం రొట్టెలు, బెల్లంతో చేసిన బొబ్బట్లు, బెల్లంతో చేసిన టీ, కాఫీలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. చక్కెర కంటే బెల్లమే మేలని ఆహారనిపుణులు చెబుతారు. బెల్లం వల్ల జీర్ణాశయంలోని ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో మినరల్స్‌తో పాటు ఐరన్‌ ఉంటుంది. ఇది శరీరానికెంతో మేలు చేస్తుంది. రక్తం శుద్ధి చేసే గుణం బెల్లానికి ఉంది. ముఖ్యంగా జాయింట్‌ పెయిన్స్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఆ మాటకొస్తే ఏ కాలంలో అయినా సరే ఆహారంలో బెల్లంను చేర్చటం మంచిదే. ఒంట్లోని వేడిని తగ్గించటానికి బెల్లం పానకం చేసేవారు పెద్దలు.


దీన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు కూడా. ఖర్చు కూడా లేదు. నెలసరి సమయంలో బెల్లంతో చేసిన ఆహారం తినటం వల్ల మహిళలకెంతో మంచిది. ఇది ఇన్‌స్టంట్‌ ఎనర్జీనిస్తుంది. ఇక చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలోని చెడును శుభ్రపరిచే న్యాచురల్‌ క్లీనర్‌ బెల్లం. ఇది చేసే అతి గొప్ప పని లివర్‌ మీద ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెల్లంలో జింక్‌, మాంగనీసు.. లాంటివి ఉంటాయి. ముఖ్యంగా దగ్గుని నివారించడంలో ముందుంటుంది. మొత్తానికి ఎన్నో రకాల ఫుడ్స్‌లో చక్కెర స్థానంలో బెల్లం చేరిస్తే సరి.. ఆరోగ్యానికెంతో మంచిది.

Read more