హృదయానికి 60 మెట్లు!

ABN , First Publish Date - 2022-10-01T17:42:26+05:30 IST

మీ గుండె భద్రమేనా? హృదయం పనితీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి మీకు మీరే ఓ పరీక్ష పెట్టుకొని

హృదయానికి 60 మెట్లు!

90 సెకన్లలో ఎక్కగలిగితే గుండె పనితీరు బాగున్నట్లు! 

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా జేబీ ఫార్మా వెల్లడి


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మీ గుండె భద్రమేనా? హృదయం పనితీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి మీకు మీరే ఓ పరీక్ష పెట్టుకొని తెలుసుకోవొచ్చునంటోంది జేబీ ఫార్మా సంస్థ. తొంభై సెకన్లలో అంటే ఒకటిన్నర నిమిషంలో 60 మెట్లు (నాలుగు ఫోర్లు) ఎక్కగలిగితే మీ గుండె పనితీరు బాగున్నట్లేనని చెబుతోంది. గుండె ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు అతి సులభమైన పరీక్ష పద్ధతి ఇదేనని, సుప్రసిద్ధ కార్డియాలజీ జర్నల్‌ ఇదే చెబుతోందని వెల్లడించింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ’హార్ట్‌ టు హార్ట్‌’ పేరుతో విన్నూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ వివరాల ప్రకారం.. ఒకవేళ 90 సెకన్లలో 60 మెట్లు ఎక్కలేకపోయినట్లయితే గుండె పనితీరు మందగించిందని అర్థం. ’హార్ట్‌ టు హార్ట్‌ ఫర్‌ హెల్తీ హార్ట్‌’ సవాల్‌ను స్వీకరించడానికి నిమిషం వ్యవధిలోనే 40 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కడం గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2030 నాటికి గుండె జబ్బుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే అత్యధిక మరణాలు సంభవిస్తాయని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మధుమేహ నియత్రణ వంటి వాటి ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని చెప్పారు.

Read more