Healthy Bladder Habits : అనుమానం రాగానే టాయిలెట్‌కు వెళుతున్నారా?

ABN , First Publish Date - 2022-12-05T14:30:46+05:30 IST

స్త్రీలకు సంబంధించి టాయిలెట్ సౌకర్యాలు తక్కువే.

Healthy Bladder Habits : అనుమానం రాగానే టాయిలెట్‌కు వెళుతున్నారా?
bladder habitshealthy

చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో ప్రతి స్త్రీ ఎదుర్కుంటున్న సమస్య టాయిలెట్ కు వెళ్ళలేని పరిస్థితి. తొందరగా గమ్యాన్ని చేరుకుని మూత్రవిసర్జనకు సిద్ధం కావాలే తప్ప, స్త్రీలకు సంబంధించి టాయిలెట్ సౌకర్యాలు తక్కువే. అయితే తరచుగా మూత్రాన్ని నియంత్రించడం వల్ల అనేక అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పటికప్పుడు కాకాపోయినా దీర్ఘకాలంలో ఈ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. ఎక్కువగా మహిళల విషయంలో వాష్‌రూమ్‌కి వెళ్ళాలనే ఆలోచనను ఆపుకుంటూ, మూత్రాశయాన్ని నియంత్రించడం ఆరోగ్యకరమైనది కాదని గమనించాలి. ఇది ఎలాంటి హానిని కలిగిస్తుందో గమనిస్తే...

bladder-habits.jpg

1. అనుమానం రాగానే : మన బిజీ లైఫ్‌లో, ఖచ్చితంగా అవసరమైనంత వరకు టాయిలెట్‌ను ఉపయోగించకుండా ఉంటాము. కానీ, ప్రతి 2-3 గంటలకు ఒకసారి మూత్రాశయాన్ని ఖాళీ చేయడం వల్ల చాలా రకాల మూత్రాశయ రుగ్మతలను, ఇబ్బందులను నివారించవచ్చు.

2. మూత్ర విసర్జన ఆలస్యం చేయవద్దు: ప్రయాణంలో అప్పుడప్పుడు మూత్ర విసర్జనను ఆపుకోవడం తప్పసరి కావచ్చు, కాకపోతే ఇదే అలవాటును అస్తమానూ చేయడం వల్ల విసర్జనకు ఆటంకం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌లు వస్తాయి.

3. మూత్ర విసర్జన సమయంలో కంగారు వద్దు : మానసికంగా, శారీరకంగా హడావిడిగా మూత్ర విసర్జన చేసి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినట్లయితే, యూరినరీ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. సౌకర్యవంతంగా కూర్చోవడం, కటి ఫ్లోర్ కండరాలను సడలించడం, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో సహాయపడుతుంది.

4. తగినంత లిక్విడ్స్ తీసుకోండి: రోజుకు 10 -12 గ్లాసులతో లేదా 2 ½ - 3 లీటర్ల ద్రవాలతో హైడ్రేట్ అవుతున్నారని తెలుసుకోవాలి. రోజులో సూప్‌లు, జ్యూస్‌లు కూడా లిక్విడ్స్ స్థానంలో తీసుకోవడం వల్ల ఒక్క నీటిపైనే ఆధారపడనవసరం లేదు.

5. కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవద్దు : టీ, కాఫీ, కోలా వంటి కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.

6. ధూమపానం మానేయండి: ధూమపానం Vasoconstrictionకు దారి తీస్తుంది, మూత్రాశయ చికాకు కారణంగా మూత్ర విసర్జన ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

7. కెగెల్ వ్యాయామాలను చేయండి: పెల్విక్ ఫ్లోర్ (Pelvic floor)వ్యాయామాలు, కెగెల్ (Kegel) వ్యాయామాలు మూత్రాశయానికి మద్దతు ఇచ్చే పెల్విక్ ఫ్లోర్‌ను బలోపేతం చేయడానికి సహకరిస్తాయి.

8. బరువును అదుపులో ఉంచాలి: అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, దీర్ఘకాలిక మలబద్ధకం పెల్విక్ ఫ్లోర్‌పై ఒత్తిడిని కలిగిస్తాయి, ఇది కండరాల బలహీనత, మూత్రం లీక్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన బరువుతో, దీర్ఘకాలిక దగ్గు, మలబద్ధకాన్ని నివారించడం వల్ల పెల్విక్ ఫ్లోర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

Updated Date - 2022-12-05T14:59:26+05:30 IST