మృదువైన పాదాల కోసం...
ABN , First Publish Date - 2022-03-10T19:02:19+05:30 IST
పాదాల మీద చర్మం లేస్తూ, అందవిహీనంగా మారుతూ ఉంటే, వారానికి ఒకసారి పెరుగు ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం..

ఆంధ్రజ్యోతి(10-03-2022)
పెరుగు ప్యాక్
పాదాల మీద చర్మం లేస్తూ, అందవిహీనంగా మారుతూ ఉంటే, వారానికి ఒకసారి పెరుగు ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం....
పెరుగు - ఒక కప్పు
శనగపిండి - అర కప్పు
తేనె - ఒక చెంచా
పాలు - నాలుగు చెంచాలు
వీటన్నిటినీ ఓ గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. పాదాలు శుభ్రంగా కడిగి ఈ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకోవాలి.
బియ్యప్పిండితో...
పాదాల మీద మృత కణాలు వదిలి, నాజూకుగా మారాలంటే తరచుగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం....
బియ్యప్పిండి - అర కప్పు
కొబ్బరిపాలు - నాలుగు చెంచాలు
నిమ్మరసం - రెండు చెంచాలు
వీటన్నిటినీ కలిపి పాదాలకు పూసుకోవాలి. రెండు చేతులతో వృత్తాకారంలో పాదాలు రుద్ది కడిగేసుకోవాలి. కాళ్లు కడిగేటప్పుడు అదనంగా సబ్బు వాడకూడదు. పాదాలు తడి లేకుండా తుడిచి తాజా వెన్న పూసుకోవాలి.
ఓవర్నైట్ ప్యాక్
పాదాలు పగుళ్లు వదిలి, కోమలంగా మారాలంటే ఓవర్నైట్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం....
గ్లిజరిన్ - రెండు చెంచాలు
కలబంద గుజ్జు - రెండు చెంచాలు
నిమ్మరసం - రెండు చెంచాలు
రాత్రి పడుకునేముందు ఈ మూడింటిని కలిపి పాదాలకు పూసుకోవాలి. ఆరిన తర్వాత సాక్స్ వేసుకోవాలి. ఉదయాన్నే సాక్స్ తీసి పాదాలు కడిగేసుకోవాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే పాదాలు కోమలంగా మారతాయి.