మధుమేహాన్ని నియంత్రించే పాదరక్షలు!

ABN , First Publish Date - 2022-06-15T20:48:31+05:30 IST

మధుమేహుల కష్టాలు తీర్చే దిశగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎ్‌ససీ) పరిశోధకులు ప్రత్యేకంగా త్రీడీ ప్రింటెడ్‌ పాదరక్షలు

మధుమేహాన్ని నియంత్రించే పాదరక్షలు!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకుల ఆవిష్కరణ 


బెంగళూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మధుమేహుల కష్టాలు తీర్చే దిశగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎ్‌ససీ) పరిశోధకులు ప్రత్యేకంగా త్రీడీ ప్రింటెడ్‌ పాదరక్షలు రూపొందించారు. ఐఐఎ్‌ససీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ రీసెర్చ్‌ (కేఐఈఆర్‌) సహకారంతో అభివృద్ధి చేసిన ఈ పాదరక్షలు ధరిస్తే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని వారు చెబుతున్నారు. పాదాలకు అయిన గాయాలను చాలా త్వరగా మానేలా ఇవి చేస్తాయని, పాదాల్లో గాయాల విస్తరణను నియంత్రిస్తాయని ఐఐఎ్‌ససీ మంగళవారం పేర్కొంది. ఆటోమేటెడ్‌ అప్‌లోడ్‌ ఇన్‌సోల్‌ స్నాపింగ్‌ సాంకేతికతను ఇందులో పొందుపరిచామన్నారు. డయాబెటిక్‌ పెరిఫెరల్‌ న్యూరోపతిగా ఈ పాదరక్షలు ఉపయోగపడతాయి. పాదాల పై సమాన ఒత్తిడి వచ్చేలా చేసి సమస్యను క్రమేపీ నియంత్రించనున్నాయి. 

Updated Date - 2022-06-15T20:48:31+05:30 IST